బావ-బామ్మర్దుల మధ్య పోరు.. మధ్యలో బలవుతున్న సారా టెండూల్కర్..

ఐపీఎల్ 2023 సీజన్‌( IPL 2023 ) రసవత్తరమైన మ్యాచ్‌లతో అభిమానులను బాగా అలరిస్తోంది.

ఎప్పటిలాగానే ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న సందర్భంగా మీమర్స్ సరికొత్త క్రికెట్ మీమ్స్‌తో పండుగ చేసుకుంటున్నారు.

వీరి మీమ్స్ చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.అయితే తాజాగా మీమర్స్‌కి క్రికెటర్ సచిన్ కూతురు సారా టెండూల్కర్( Sara Tendulkar ) దొరికింది.

సారా టెండూల్కర్ తమ్ముడు అర్జున్ ( Arjun Tendulkar ) ముంబై ఇండియన్స్ జట్టు తరుఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

దీనికి మెంటార్‌గా సచిన్ వ్యవహరిస్తున్నారు. """/" / ఇక సారా టెండూల్కర్ శుభ్‌మన్ గిల్‌తో( Shubman Gill ) ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అప్పటినుంచి శుభ్‌మన్ గిల్‌ బాగా ఆడినప్పుడల్లా సారాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వస్తున్నారు నెటిజన్లు.

శుభ్‌మన్ ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.అయితే నిన్న గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది.

ఇందులో సారా తమ్ముడు అర్జున్, సారా లవర్‌గా చెప్పుకునే శుభ్‌మన్ గిల్‌ ఒకరికి ఒకరు తలపడ్డారు.

"""/" / దీంతో మీమర్స్ బావ-బామ్మర్దుల మధ్య పోటీ మొదలయ్యిందని, సారా ఎవరికి సపోర్ట్ చేస్తుందో చెప్పాలని ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్‌లో వదిలారు.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ సాధించాడు.దీంతో సారా తెగ ఖుషి అవుతుందని మరికొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

అటు తమ్ముడికి, ఇటు ప్రియుడికి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక తలబాదుకుంటుందేమో అని కూడా మీమ్స్ క్రియేట్ చేసి అందర్నీ నవ్విస్తున్నారు.

ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ మాత్రం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓడిపోయింది.

బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను.. రేవతి భర్త సంచలన నిర్ణయం వైరల్!