రామ్ చరణ్ తో ‘నెట్ ఫ్లిక్స్’ అధినేత టెడ్ సరాండోస్ భేటీ..హాలీవుడ్ యాక్షన్ మూవీ కి ముహూర్తం ఫిక్స్!
TeluguStop.com
హాలీవుడ్ నుండి కూడా రామ్ చరణ్ కి ఆఫర్స్ వెల్లువ లాగ వస్తూనే ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో 'గేమ్ చేంజర్' ( Game Changer )అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఇప్పటికే 80 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
"""/" /
ఇదంతా పక్కన పెడితే నేడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అధినేత టెడ్ సరాండోస్ ( Ted Sarandos )రామ్ చరణ్ కి ఇంటికి వెళ్లి సుమారుగా ఒక గంట సేపు చర్చలు జరిపాడు.
ఈ భేటీ లో రామ్ చరణ్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా హాజరు అయ్యాడు.
ఈ ఇంటర్వ్యూస్ లో రామ్ చరణ్ తనకి ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఆ హాలీవుడ్ యాక్షన్ మూవీ గురించి చర్చలు జరిపేందుకు టెడ్ సరాండోస్ రామ్ చరణ్ ఇంటికి విచ్చేసాడని తెలుస్తుంది.
ఒక ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఈ చిత్రానికి లేదా వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్నాడట.
"""/" /
ఇప్పటికే హాలీవుడ్ లో మన సౌత్ నుండి ధనుష్ ( Dhanush )ఎంట్రీ ఇచ్చాడు.
కానీ హీరో గా మాత్రం కాదు, ఒక చిన్న పాత్రలో కనిపించాడు.కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ రామ్ చరణ్ ని హీరోగా పెట్టి ఒక భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా లేదా వెబ్ సిరీస్ ని చేసే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటుగా రాంచరణ్ బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కూడా ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే బయటకి రానుంది.