నెట్‌ఫ్లిక్స్ లో సరికొత్త ఫీచర్..!!

ప్రముఖ ఓటీటి ఫ్లాట్ ఫార్మ్ అయిన నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల కోసం తాజాగా ఒక సరికొత్త ఫీచర్ ను మన ముందుకు తీసుకుని వచ్చింది.

రాబోయే రోజుల్లో నెట్ ఫ్లిక్స్ మరింత ఆకర్షణీయంగా మారనుందని మంగళవారం నాడు ఆ సంస్థ ప్రకటించింది.

ఇకమీదట వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ లో మరింత సులభంగా తమకు నచ్చిన చిత్రానికి లేదా వెబ్‌ సిరీస్‌కు మద్దతుగా "డబుల్ థంబ్స్ అప్" ఇవ్వడానికి అనుమతిస్తుంది.

వివరాల్లోకి వెళితే.ఇప్పటిదాకా నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా ఒక చిత్రం గాని వెబ్ సిరీస్ గాని నచ్చితే దాన్ని మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పాలనుకుంటాం.

అలాగే దాని గురించి సోషల్‌ మీడియాలో కూడా అందరితో పాలుపంచుకోవాలని అనుకుంటాం.ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు డబుల్ థంబ్స్ అప్‌ అనే సరికొత్త ఫీచర్ ను మనకు పరిచయం చేయబోతున్నారు.

మీకు ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నచ్చుతాయో వాటిని ఇతరులకు తెలియజేయడానికి సభ్యులకు ఇదోక అవకాశం అనే చెప్పాలి.

నచ్చిన సినిమాలు, సిరీస్‌ లకు మీకు కింద థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ బటన్‌ లను ఎంపిక చేసి మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు.

అయితే ఈ ఫీచర్ కేవలం వెబ్ ఆండ్రాయిడ్, IOS మొబైల్ అన్ని యాప్స్‌లో అందుబాటులోకి వచ్చింది అని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ క్రిస్టీన్ డోయిగ్-కార్డెట్ ఒక ప్రకటనలో తెలిపారు.

"""/"/ మీరు నెట్‌ఫ్లిక్స్ లో ఏదైనా సిరీస్ లేదా ఫిల్మ్ చూసిన తర్వాత మీ యొక్క ఫీలింగ్‌ ఎలా ఉందనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఊయోగపడుతుంది.

డబుల్ థంబ్సప్ బటన్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది.అయితే ఇది దశలవారీగా రోల్ అవుట్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ లోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

మీరు ఇష్టపడే అంశాలపై మరిన్ని వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వచ్చేలా చేసేందుకు ఈ డబుల్‌ థంబ్స్‌ అప్‌ చాలా ఉపయోగపడుతుంది.

దేవర సక్సెస్ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుందా.. ఈ రేంజ్ లో ఎవరూ యాక్ట్ చేయలేరంటూ?