నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల మెంబర్‌షిప్ పూర్తిగా ఉచితం.. ఇలా పొందండి..
TeluguStop.com
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో( Netflix, Amazon Prime Video ) అనేవి భారతదేశంలో లెక్కలేనన్ని సినిమాలు, టీవీ సిరీస్‌లను అందించే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు.
ఈ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను చూడాలనుకుంటే బాగానే మనీ చెల్లించాల్సి వస్తోంది.అయితే వీటిలోని కంటెంట్ ఉచితంగా యాక్సెస్ చేయడానికి ఒక ఉపాయం ఉంది.
అదేంటంటే యూజర్లు జియో లేదా ఎయిర్‌టెల్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసి వీటి సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.
జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్( Jio Rs.
699 Postpaid Plan ) తీసుకున్న కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోసినిమా, జియోటీవీలోని కంటెంట్‌కు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు.
అంతేకాదు ఇదే ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100జీబీ మంత్లీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.
ఈ ప్లాన్‌కి గరిష్ఠంగా ముగ్గురు కుటుంబ సభ్యులను కూడా జోడించవచ్చు.వారిలో ప్రతి ఒక్కరూ అదనంగా 5GB డేటాను అందుకుంటారు.
ఎయిర్‌టెల్ రూ.1,199 పోస్ట్‌పెయిడ్( Airtel Rs.
1,199 Postpaid ) ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అపరిమిత కాలం పాటు ఉచితంగా అందిస్తుంది.
అలానే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, 1 ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్రీమియం, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, వింక్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన్ కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది.240జీబీ మంత్లీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్ ఆఫర్ చేస్తుంది.
"""/" /
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ సపరేట్‌గా తీసుకునే విషయానికొస్తే.మొబైల్-ఓన్లీ యాక్సెస్ కోసం నెలకు రూ.
149, బేసిక్ ప్లాన్‌కు రూ.199, స్టాండర్డ్ ప్లాన్‌కు రూ.
499, ప్రీమియం ప్లాన్‌కు రూ.649 చెల్లించాల్సి ఉంటుంది.
"""/" /
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ సపరేట్‌గా తీసుకోవాలనుకునేవారు.రూ.
299 మంత్లీ సబ్‌స్క్రిప్షన్, రూ.599 క్వార్టర్లీ ప్లాన్, రూ.
1,499 యాన్యువల్, రూ.999 యాన్యువల్ ప్రైమ్ లైట్ ప్యాక్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు .
"""/" /
జియో లేదా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడం ద్వారా, మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలతో పాటు ఇతర ప్రయోజనాలను విడివిడిగా సబ్‌స్క్రయిబ్ చేయడంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో యాక్సెస్ పొందుతారు.
అంతేకాకుండా, అమెజాన్ కొత్త వినియోగదారుల కోసం 1-నెల ఉచిత ట్రయల్‌ను అందిస్తుంది, దీనితో మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రైమ్ వీడియోను ఫ్రీగా ఒక నెల పొందవచ్చు.