నేతన్న భీమా పథకము

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు తెలియజేయునది ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం నేతన్నకు భీమా పథకమును ప్రవేశపెట్టినది.

ఇట్టి పథకములో చేరడానికి చేనేత మరియు మరమగ్గాల కార్మికులు,అనుబంద కార్మికులు అనగా డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైన్డింగ్, సైజింగ్, వైపని, బ్లీచింగ్, రోలింగ్ (గమ్మింగ్) కార్మికులు అర్హులు.

గత సంవత్సరం ఈ పథకంలో చేరని చేనేత మరియు మరమగ్గాల కార్మికులు చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో తేదీ 08.

08.2024 లోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఇట్టి పథకంలో నమోదు అయిన కార్మికులు ఏదైనా కారణాల చేత మరణించినట్లయితే అట్టి కుటుంబానికి రూ.

5.00 లక్షల బీమా వస్తుంది.

18-59 సం.వయస్సు కల్గిన కార్మికులు మరియు అనుబంధ కార్మికులు వారి పాస్ పోర్ట్ సైజ్ పోటో, అధార్ కార్డ్,బ్యాంకు ఖాతా జిరాక్స్,నామిని ఆధార్ కార్డ్,బ్యాంకు ఖాతా జిరాక్స్ తో చేనేత,జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించగలరు.

ఎవరైనా అర్హులైన చేనేత,మరమగ్గాల కార్మికులు నేతన్న భీమ పథకంలో చేరుటకు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో తేదీ 08.

08.2024 లోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఇతర వివరముల కొరకు చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించగలరని తెలిపారు.

వెరైటీగా కూరగాయలు అమ్ముతున్న నేపాలి అమ్మాయి.. వీడియో వైరల్..?