అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?
TeluguStop.com
అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) సక్సెస్ తో బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
దానికి తోడు అల్లు అర్జున్ అరెస్ట్ అవడం అన్నది కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి( Sneha Reddy ) గురించి మనందరికీ తెలిసిందే.
స్నేహ రెడ్డి అల్లుకోడలుగా బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూ పలు బిజినెస్లలో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన కూతన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూనే ఉంటుంది స్నేహ రెడ్డి.
"""/" /
కాగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులకు 2011లో పెళ్లి అయిన విషయం తెలిసిందే.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా స్నేహారెడ్డి మసాటుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్నేహారెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ఆ తర్వాత అమెరికాలోనే కంప్యూటర్స్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసింది.
స్నేహా రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది అని చెప్పాలి.
ఆమె కూడా సంపన్నుల కుటుంబం నుంచి వచ్చింది.ఆమె తండ్రి సయంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఛైర్మన్.
అంతేకాదు, రాజకీయ నాయకుడు కూడా.తండ్రికి చెందిన కంపెనీలో స్నేహారెడ్డి డైరక్టర్ గా వర్క్ చేస్తోంది.
"""/" /
పెళ్లి తర్వాత సొంతంగా పికాబూ( Picaboo ) అనే ఆన్ లైన్ ఫొటో స్టూడియో కూడా ఏర్పాటు చేసింది.
ఈ రెండు వ్యాపారాలతో పాటు ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్ గా, పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది.
ఇంస్టాగ్రామ్ లో ఆమెకు 9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి.
ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు.పుష్ప 2 సక్సెస్ తో సోషల్ మీడియాలో స్నేహాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
వీటితో పాటు ఆమెకు ఇంకా స్థిర చర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
పుష్ప2 1400 కోట్లు.. మిస్ యూ 2 కోట్లు.. సిద్దార్థ్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా?