అమెరికాలో జరిగిన కాల్పుల్లో నేరేడుచర్ల యువతి మృతి…!

సూర్యాపేట జిల్లా: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రామనర్సింహారెడ్డి మనమరాలు తాటికొండ ఐశ్వర్య (27) మృత్యువాత పడ్డారు.

ఐశ్వర్య తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి అరుణ గృహిణిగా ఉన్నారు.

కాల్పులో ఐశ్వర్యతో పాటు మరో 8 మంది మృత్యువాత పడ్డారు.ఐశ్వర్య అమెరికాలో పర్ఫెక్ట్ జనరల్ లో ప్రాజెక్టు మేనేజర్ గా చేస్తున్నారు.

ఐశ్వర్య మృతి చెందివార్త ఆమె తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను శోకసముద్రంలో ముంచింది.

దీనితో నేరేడుచర్ల పట్టణంలో సైతం విషాదఛాయలు నెలకొన్నాయి.మే నెలలో ఐశ్వర్య పుట్టినరోజు ఉండడంతో అనంతరం పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడ్డారు.ఐశ్వర్య మృతదేహం మన దేశానికి తరలించడానికి మూడు రోజులు పట్టేలా ఉందని, హైదరాబాదులోని సొంత ఇంట్లో దహన సంస్కారాలు జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం