పోలీస్ పహారాలో నేరేడుచర్ల

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలో శుక్రవారం రాత్రి ఇరువురి మద్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిికి తీవ్ర గాయాలయ్యాయి.

దీనితో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారతీసింది.ఘర్షణలు పునరావృతం కాకుండా రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఐ పరమేష్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలు పరిరక్షణ కోసం పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

రాత్రి వేళలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వేళలో పోలీసుల నిఘా ఏర్పాటు చేసి,పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు.

రాత్రి 10 గంటలకే దుకాణదారులు తమ దుకాణాలను మూసివేశారు.పట్టణంలో ప్రస్తుతం పోలీసు బందోబస్తు కొనసాగుతుంది.

దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌ల‌ను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!