కలెక్టర్ పై దాడిని ఖండించిన నేరేడుచర్ల రెవెన్యూ అధికారులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్ తో పాటు పలువురు అధికారులపై దాడి నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదుట దాడిని ఖండిస్తూ,రెవిన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా తాహసిల్దార్ సైదులు మాట్లాడుతూ.వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్,అడిషనల్ కలెక్టర్,ప్రత్యేక అధికారి, తదితర ప్రభుత్వ అధికారులపై,కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ మౌనిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెళ్లి వేడుకపై గుండెపోటుతో పెళ్ళికొడుకు స్నేహితుడు మృతి (వీడియో)