ఉత్తర భారతంపై నేపాల్ భూకంప తీవ్రత

నేపాల్ లో తీవ్ర కలకలం సృష్టించిన భూకంప తీవ్రత ఉత్తర భారతంపై పడింది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు బీహార్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లపై పరుగులు పెట్టారు.భారీ భూకంపంతో నేపాల్ గజగజలాడింది.

రాత్రి 11.30 గంటల సమయంలో భూమి కంపించింది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయింది.

నేపాల్ భూకంపలో సుమారు 128 మంది ప్రాణాలు కోల్పోయారు.వందలాది మంది గాయాలపాలయ్యారు.

ఇళ్లు, భవనాలు నేలమట్టం కాగా కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.శిథిలాల కింద చాలా మృతదేహాలు చిక్కుకుని ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా అధికారుల రెస్య్కూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?