మరో పోరాటానికి సిద్దమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..
TeluguStop.com
నెల్లూరు: మరో పోరాటానికి సిద్దమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ నెల 6న పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష చేపట్టనున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.
కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాటం చేయనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.
వైసీపీ నుంచి దూరం జరిగినా.నన్ను సస్పెండ్ చేసినా నేను ప్రజా సమస్యలపై తగ్గేదేలే.
రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై నాలుగేళ్ళుగా గళమెత్తుతూనే ఉన్నా.పొట్టేపాలెం కలుజు, ములుముడి కలుజుల వద్ద బ్రిడ్జిల నిర్మాణం, రోడ్డు సాధన కోసం పోరాడుతా.
6వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేపట్టబోతున్నాను.
ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా ఒక్కడినే కలుజులోని నీటిలో కూర్చుంటా.ఈ కలుజు సమస్యపై ఇవాళ పోరాటం చేయడం లేదు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాలుగేళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాను.సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను.
2019 జులై 25వ తేదీన ముఖ్యమంత్రిని కలిసి కలుజు నిర్మాణం కోసం వినతిపత్రం ఇచ్చాను.
జగన్ గారు సంతకం కూడా పెట్టారు.ఆయన ఆదేశాలు ఇచ్చాక 10 రోజుల తర్వాత సంభందిత శాఖలకు అదేశాలని పంపుట్టున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు లేఖ వచ్చింది.
ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా పడలేదు.అప్పటి నుంచి అధికారులకి వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నాను.
పొట్టేపాలెం కలుజు సమస్య ఒక్క రూరల్ దే కాదు.కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో పాటు కడప జిల్లాకు వెళ్లే రహదారి ఇది.
అనేక సార్లు ఇటు వెళ్లే ప్రయాణికులు కలుజు వద్ద జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు.
ఒకటిన్నర ఏడాది క్రితం వరదల్లో ఇక్కడికి సీఎం జగన్ వచ్చినప్పుడు కలుజుని చూపించాను.
వెంటనే బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం కోసం 28 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికి కనీసం ఒక్క అడుగు పడలేదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉద్యమానికి సిద్ధం.
రూరల్ సమస్యలపై గాంధీగిరి నిరసన కోసం ఎంత దూరం అయినా పోరాడుతాను.నేను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే జిల్లా ప్రజలు నాకు అండగా ఉండండి.
ఈ నెల 13నుంచి జగనన్న కి చెబుదాం రండి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం జగన్ గారు ప్రకటించారు.
మేము కూడా అదే రోజు నుంచి జనం చెప్పింది విందాం రండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం.
శిలాఫలకంపై నా పేరు లేకపోయినా పర్వాలేదు.మీరు పనులు చేయండి.
నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!