సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి ఆవులు మేపుతూ లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తి.. సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం( Business ) బెస్ట్ అని భావిస్తున్నారు.
వ్యాపారం చేయడం ద్వారా కొంతమంది కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
సాఫ్ట్ వేర్ జాబ్ కు గుడ్ బై చెప్పి ఆవులు మేపుతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే వ్యవసాయం, ఆవుల పోషణలోనే సంతోషం ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన వినోద్ కుమార్( Vinod Kumar ) చెబుతున్నారు.
మనస్సుకు నచ్చిన పని చేయాలనే ఆలోచనతో సాఫ్ట్ వేర్ జాబ్( Software Job ) వదిలి ఈ పని చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.
ఇంజనీరింగ్ చదువుకున్న పాలపర్తి వినోద్ కుమార్ తల్లీదండ్రులు ఆవులను అమ్మేస్తామని చెప్పగా అలా చేయడం తనకు ఇష్టం లేకపోవడంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.
లక్షల్లో వచ్చే జీతం వదిలి తన కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకుంటూ కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
"""/" /
ఆవుల ద్వారా( Cows ) వచ్చే పేడను పొలంలో ఎరువుగా వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో వినోద్ కుమార్ పంటలను సాగు చేస్తున్నాడు.
ఎంతోమందికి వినోద్ కుమార్ స్పూర్తిగా నిలుస్తున్నాడు.ఒంగోలు ఆవులు( Ongole Cows ) అంతరించకూడదని వినోద్ కుమార్ సెమెన్ స్టాల్ ఏర్పాటు చేశారు.
ఒంగోలు జాతి ఆవుల పోషణలో సలహాలు, సూచనలు ఇస్తానని వినోద్ కుమార్ చెబుతున్నారు.
పాల వ్యాపారం, వ్యవసాయం ద్వారా ఎంతోమంది యువతకు వినోద్ కుమార్ స్పూర్తిగా నిలుస్తున్నారు.
"""/" /
సొంతూరిలో ఉండటం సంతోషంగా ఉందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సంపాదించే మొత్తంతో పోల్చిచూస్తే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నానని వినోద్ కుమార్ చెబుతున్నారు.
100 మందిలో 10 మంది వ్యవసాయం చేస్తే బాగుంటుందని వినోద్ కుమార్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వినోద్ కుమార్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో: ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..