నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అధికారం అనుభవించి చివరిలో బయటకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు.అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డానని కోటంరెడ్డి చెప్పారు.

వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాక తనను రాజీనామా చేయాలని అడగాలన్నారు.వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

అయితే ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్ష అని వెల్లడించారు.

సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.