ఒకరాత్రికి వస్తావా.? నీ రేటెంతా.? అని మెసేజ్ చేసిన వ్యక్తికి ఆ హీరోయిన్ ఎలా బుద్ది చెప్పిందో తెలుసా.?
TeluguStop.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టు ఉద్యమం గురించి కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట.
ఒక్క ఛాన్స్ కోసం అంటూ వచ్చి గతిలేక బలైపోతున్నారు.సినీ పెద్దలే అనుకుంటే.
సాధారణ పబ్లిక్ కూడా కొంతమంది వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు.మలయాళీ, కన్నడ భాషల్లో నటిగా పాపులర్ అయిన హీరోయిన్ నేహా సక్సేనాకు ఒక దుండగుడు అసభ్యంగా సందేశాలు పంపిన వ్యవహారం బట్టబలైంది.
వివరాలలోకి వెళ్తే.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కన్నడ, మలయాళీ చిత్రాల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది నేహా.
2013 లో ఇండిస్ట్రిలోకి అడుగుపెట్టిన నేహా సక్సేనా సినిమాలతో పాటు కొన్ని టివి సీరియల్స్‌లో కూడా నటించింది.
ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన నేహాకు చేదు అనుభవం ఎదురైంది.
ఒకరు మితిమీరి ప్రవర్తించారు.నీ రేటెంత అని మెసేజ్ పెట్టాడు.
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో లోహిదక్షన్ అనే వ్యక్తి అక్కడ నేహా సక్సెనాని చూశాడు.
ఆమె మేనేజర్ కు, పిఆర్ కు నేహా రేటెంత, ఒకరాత్రి గడపడానికి అంగీకరిస్తుందా అంటూ మెసేజ్ పెట్టాడు.
మేనేజర్ ఈ విషయాన్ని నేహా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
వెంటనే అతడు వాట్సాప్ ద్వారా పెట్టిన సందేశాల్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అతడు పనిచేస్తున్న ఆఫీస్ కి నా స్నేహితులు వెళ్లారు.
అతడు అక్కడ లేడని తెలిసింది.పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.
ఇలా చేస్తే అతను చిక్కులు కొనితెచ్చుకున్నటు.బహిరంగంగా క్షమాపణ కోరుతూ లెటర్ విడుదల చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని నేహా సక్సేనా అన్నారు.