తల్లైనా తండ్రైనా నువ్వే అమ్మ.. హీరోయిన్ నేహా సక్సేనా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
TeluguStop.com
తాజాగా ఫాదర్స్ డే( Father's Day ) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ వారి వారి తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు( Celebrities ) కూడా వారి తండ్రి ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
మరికొందరు ఎమోషనల్ కూడా అయ్యారు.కొందరి సెలబ్రిటీలు వారి తండ్రులను తలుచుకొని ఎమోషనల్ కూడా అయ్యారు.
వారిలో హీరోయిన్ నేహా సక్సేనా కూడా ఒకరు. """/" /
ఈ మేరకు ఆమె ఒక వీడియోని పోస్ట్ చేస్తూ.
హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా, నాన్న లేడు అన్న లోటు తెలియకుండా పెంచావు.
పుట్టినప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం.అమ్మ, నాన్న, ఫ్రెండ్.
అన్నీ నువ్వే అయ్యావు.నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు థాంక్యూ అమ్మా.
నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను.ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
"""/" /
ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం.లవ్ యూ మా.
అని రాసుకొచ్చింది నేహా( Neha ).ఇకపోతే నేహా సక్సేనా విషయానికి వస్తే.
మొదట రిక్షా డ్రైవర్ అనే తుళు సినిమాతో కెరీర్ ను ప్రారంభించింది.ప్రేమకు చావుకు అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ భాషల్లో నటించింది.ప్రస్తుతం వృషభ అనే సినిమా చేస్తోంది.
అలాగే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!