ఆ పనులు చేసి 23 కిలోల బరువు తగ్గానన్న ప్రముఖ నటి.. అప్పటినుంచే ఆఫర్లు అంటూ?

మామూలుగా స్త్రీలు తల్లి అయిన తర్వాత ఆ శరీరంలో కొన్ని మార్పులు రావడం అన్నది సహజం.

కొంతమంది చాలా లావుగా మారిపోతూ ఉంటారు.ముఖ్యంగా బయట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లి తర్వాత లావుగా మారిపోతే మాత్రం వారిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు.

"""/" / అటువంటి వారిలో బాలీవుడ్ నటి మోడల్ నేహా ధూపియా( Neha Dhupia ) కూడా ఒకరు.

పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఫిట్నెస్ విషయంలో ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నేహా.

ప్రెగ్నెన్సీ( Pregnancy ) తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని మరింత ధృడంగా తయారైంది.

గర్భం దాల్చిన రెండుసార్లు 23 నుంచి 25 కిలోల దాకా బరువు పెరిగినట్లు తెలిపింది.

  సందర్భంగా ఈ విషయాల గురించి నేహా మాట్లాడుతూ.మెహర్‌ పుట్టాక లాక్‌డౌన్‌ వచ్చింది.

ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి డైట్‌ పాటించి బరువు తగ్గాను.ఇంతలో మూడేళ్లకే మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యాను అలా బరువు ( Weight ) పెరిగాను.

డెలివరీ తర్వాత నేనెంత లావు అవుతాను? """/" / ఎలా కనిపిస్తాననేది ఆలోచించలేదు.నా పిల్లలిద్దరికీ ఏడాది వయసొచ్చే దాకా పాలిచ్చాను.

గత ఏడాది వరకు శరీరంపై ఫోకస్‌ పెట్టలేదు.ఎప్పుడైతే ఫిట్‌నెస్‌( Fitness ) ఆలోచన వచ్చిందే వెంటనే ఎక్సర్‌సైజ్‌, డైట్‌ వంటివి పాటించడం మొదలు పెట్టాను.

అలా నేను 23 కిలోలు తగ్గిపోయాను.అయినా ఇంకా నేను అనుకున్నంత బరువు తగ్గలేదు.

త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరతాను.అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే.

ఈ బరువు తగ్గడమనేది నా కెరీర్‌ కు ఎంతగానో ఉపయోగపడింది.వెయిట్‌ లాస్‌( Weight Loss ) అయినప్పటి నుంచే నాకు ఆఫర్లు రావడం ఎక్కువ అయ్యాయి.

బరువు తగ్గడం కోసం నేను మరీ అంత కఠిన ఎక్సర్‌సైజ్‌లు పాటించలేదు.రన్నింగ్‌ చేస్తాను, అప్పుడప్పుడు జిమ్‌కు వెళ్తాను.

చక్కెర, గ్లుటెన్‌, ఫ్రై చేసిన పదార్థాలను తీసుకోవడం మానేశాను.రాత్రి ఏడింటికే డిన్నర్‌ ముగిస్తాను.

ఇవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పుకొచ్చింది నేహా.

జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?