పచ్చిరొట్ట సబ్సిడీ విత్తనాలపై అగ్రికల్చర్ అధికారుల నిర్లక్ష్యం

నల్లగొండ జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ మీద అందించే పచ్చిరొట్ట విత్తనాలను నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో అగ్రికల్చర్ అధికారులు రైతులకు సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మొలకపట్నం గ్రామానికి చెందిన రైతు,ప్రముఖ న్యాయవాది నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తూ ఆదివారం ఆయన ప్రకటనవిడుదల చేశారు.

జిల్లాలోని అన్ని మండలాలకు పచ్చిరొట్ట సాగు విత్తనాలు సబ్సిడీలో వచ్చాయని,వాటిని రైతులకు సరఫరా చేయకుండా వాట్సప్ గ్రూపులో మెసేజ్ పెట్టి వేములపల్లి మండల అగ్రికల్చర్ అధికారులు చేతులు దులుపకున్నారని అవేదన వ్యక్తం చేశారు.

వాట్సప్ అవగాహన లేని రైతులు ఎలా కొనుగోలు చేస్తారని,ఇదే విషయం ఏఓను అడిగితే మాకు తెలువదని అంటుంటే, సమస్య గురించి చెబుదామని జేడిఏకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదని రైతులంటే ఎందుకంత అలసత్వమన్నారు.

ఒక రైతు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని దుస్థితిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండటం సిగ్గుచేటని అన్నారు.

గ్రామ స్థాయిలో దండోరా వేయించి రైతులకు సమాచారం అందించాల్సిన వ్యవసాయ శాఖ నిద్ర మత్తులో ఉందనడానికి ఇంతకంటే ఏమీ రుజువులు కావాలని ప్రశ్నించారు.

అసలే రైతు పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక పెట్టిన పెట్టుబడి వెళ్ళక ఆత్మహత్యలు చేసుకుంటుంటే,ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వచ్చిన పచ్చిరొట్ట సాగు విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు.

ఇప్పటికైనా అగ్రికల్చర్ జేడిఏ జర నిద్ర మత్తు వదిలి గ్రామగ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను జాగృతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సింపుల్ చిట్కాల‌తో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!