పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు:ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: గ్రామాల్లో పారిశుద్ద్యంపై నిర్లక్ష్యం తగదని,గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నేరేడుచర్ల ఎంపిడిఓ సోమ సుందర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా(Suryapet District ) నేరేడుచర్ల మండలం సోమారం గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి,డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం,అంగన్వాడి కేంద్రాలు,నర్సరీలను తనిఖీలు చేసి,రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.గ్రామంలో డ్రైనేజీలు,రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి,చెత్తను సేకరించాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం ప్రజల ఇంటి పరిసర ప్రాంతాల్లోని మురుగునీరు,నీటి తొట్లలో నీటిని తొలగించారు.ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ,సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలకు,పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారి,గ్రామపంచాయతీ అధికారులు,సిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో టెంపుల్ రన్ ఆడిన టూరిస్ట్స్‌.. వీడియో చూస్తే షాకే..?