పాజిటివిటీ గోరంత నెగిటివిటీ కొండంత.. బన్నీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందిగా!
TeluguStop.com
ఏదో సామెత చెప్పినట్టు స్టార్ హీరో అల్లు అర్జున్ కు( Allu Arjun ) పరిస్థితులు అన్నీ నెగిటివ్ గా మారుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బన్నీ తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బన్నీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ డీజీపీ జితేందర్( DGP Jitender ) మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటన( Sandhya Theatre Incident ) దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ కు మేము వ్యతిరేకం కాదని చట్ట ప్రకారం బన్నీపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
అన్నింటికంటే పౌరుల రక్షణ, భద్రత ముఖ్యమని వెల్లడించారు.బన్నీ సినిమా హీరో కావచ్చని అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని జితేందర్ వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచివి కావని ఆయన చెప్పుకొచ్చారు.ప్రజల భద్రతతో పోలిస్తే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదని డీజీపీ అన్నారు.
"""/" /
బన్నీ నిజ జీవితంలో కూడా నటిస్తున్నట్టే ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి( MP Chamala Kiran Kumar Reddy ) వెల్లడించారు.
ఎవరో రాసిన నోట్ ను బన్నీ ప్రెస్ మీట్ లో చదివారని అలా చదవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
నిజ జీవితంలో కూడా బన్నీ యాక్ట్ చేస్తున్నట్టే ఉందని చామల వెల్లడించారు.అసెంబ్లీలో సీఎం వాస్తవాలు చెప్పారని సినిమాల్లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు.
"""/" /
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్( MLC Balmoor Venkat ) మాట్లాడుతూ బన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని పేర్కొన్నారు.
బన్నీ సినిమా హాల్ లో ఎంతసేపు ఉన్నారో వెళ్లేటప్పుడు ఎలా వెళ్లారో ఫుటేజ్ ఉందని బల్మూరి వెంకట్ వెల్లడించారు.
బన్నీ ఇప్పటికైనా జరిగిన ఘటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.బన్నీకి పాజిటివిటీ గోరంత ఉంటే నెగిటివిటీ కొండంత ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఇలాగే కాబోలు.. వైరల్ వీడియో