ప్రాజెక్ట్ కె గురించి చెప్పింది మొత్తం అసత్యలేనా..? ప్రభాస్ కి ఇప్పట్లో హిట్ రానట్టే!
TeluguStop.com
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'ప్రాజెక్ట్ K '( Project K ) మూవీ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఆశిస్తే, ఎదో ఫ్యాన్ మేడ్ ఎడిట్ లాగా ఉంది అంటూ ఫ్యాన్స్ డైరెక్టర్ నాగ అశ్విన్( Director Nag Ashwin ) ని ట్యాగ్ చేసి బండ బూతులు తిట్టారు.
600 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారు అన్నారు, కానీ కనీసం ఫోటో ఎడిట్స్ చెయ్యడం కూడా రాదు అంటూ ఒక రేంజ్ లో తిట్టిపోశారు.
దీనికి బదులు మామూలు ఫ్యాన్స్ కి ఇచ్చినా మంచిగా ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళు కదా అంటూ కామెంట్ చేసారు.
ఇక ఈరోజు విడుదల అవ్వబొయ్యే గ్లిమ్స్ వీడియో కూడా ఇలాగే ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలన్నీ ఆవిరి అయిపోతాయని ఫ్యాన్స్ భయపడుతున్నారు.
"""/"/
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్( Prabhas ) చేసిన సినిమాలన్నీ ఓవర్ హైప్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవే.
సాహూ చిత్రానికి 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారు అన్నారు.సినిమా చూస్తే అంత ఖర్చు చేసినట్టు ఎక్కడా అనిపించదు.
కొన్ని కీలక చేసింగ్ సీక్వెన్స్ లో బాగా ఖర్చు చేసారు అనిపించింది కానీ, సినిమా మొత్తం మామూలు బడ్జెట్ తోనే తీసినట్టుగా అనిపించింది.
ఇక రాధే శ్యామ్( Radhe Shyam ) విషయం లో కూడా అదే జరిగింది.
క్లైమాక్స్ లో వచ్చే షిప్ సన్నివేశాలు, మిగిలిన కీలక సన్నివేశాల కోసం 250 కోట్లు ఖర్చు చేసారు అని పబ్లిసిటీ చేసారు.
కానీ అప్పట్లో ఓవర్ హైప్ పెంచిన ఆ క్లైమాక్స్ షిప్ సన్నివేశం చాలా చీప్ క్వాలిటీ తో తీసినట్టు గా ఆడియన్స్ కి అనిపించింది.
ఇక రీసెంట్ గా విడుదలైన 'ఆదిపురుష్'( Adipurush ) చిత్రం కూడా అంతే.
"""/"/
500 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తీసాము అని చెప్పారు, మోషన్ కాప్చర్ టెక్నాలజీ ఉపయోగించారు అని చెప్పుకున్నారు.
కానీ చివరికి కార్టూన్ బొమ్మల సినిమాని చూసినట్టు అనిపించిందని అందరూ కామెంట్ చేసారు.
ఇప్పుడు ప్రాజెక్ట్ K చిత్రం కూడా అలాగే ఉంటుందా.?, ఒకవేళ సినిమా ఔట్పుట్ అలా ఉంటే మాత్రం ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ అనే చెప్పాలి.
ఈ సినిమా ఎంత మాత్రం క్వాలిటీ తో ఉంటుంది అనేది ఈరోజు విడుదల అవ్వబొయ్యే గ్లిమ్స్ వీడియో ద్వారా తెలియనుంది.
ఈ చిత్రం ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్ , దీపికా పదుకొనే( Deepika Padukone ), అమితాబ్ బచ్చన్ , దిశా పఠాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళ రెమ్యూనరేషన్స్ వల్లే అంత అయ్యుంటాది కానీ , సినిమా ప్రోడక్ట్ ని నిర్మించడానికి అంత బడ్జెట్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు.
‘కిస్సిక్’ డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుంది.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు !