నెగిటివిటీ పెరుగుతోంది సలార్.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమాకు భారీ నష్టమంటూ?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ).హీరోగా నటించిన సలార్ సినిమా( Salaar Movie ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అయితే ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు డిసెంబర్ 22వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి ప్రశాంత్నీల్ ( Prashanth Neel ) ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించారు.

ఇలా ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా గురించి మరోవైపు కాస్త నెగిటివిటీ కూడా పెరుగుతూ వస్తోందని చెప్పాలి.

"""/" / ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ పరంగా భారీ బజ్ క్రియేట్ చేసింది అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో( Social Media ) పనికట్టుకొని ఈ సినిమాపై నెగిటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాలి.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదల అవుతున్నప్పటికీ కొంతమంది హీరోలు ఈ సినిమా పట్ల ఏమాత్రం భయపడడం లేదని అందుకే టైర్ 2హీరోలు కూడా సినిమాకు రెండు రోజులు అటు ఇటుగా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ కొంతమంది ఈ సినిమా పట్ల కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / ఈ విధంగా ప్రభాస్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ నెగెటివిటీ( Negativity ) పూర్తిగా తొలగిపోవాలి అంటే అప్పుడప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ లేదా ఎలాంటి అప్డేట్స్ అయినా విడుదల చేస్తూ ఉంటేనే ఈ సినిమాపై వస్తున్నటువంటి నెగెటివిటీ తొలగిపోతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ కనుక విడుదల చేస్తే ఈ సినిమాపై వస్తున్నటువంటి నెగెటివిటీ మొత్తం తొలగిపోతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్ల( Negative Comments ) పై రియాక్ట్ అవుతూ వాటిని కొట్టి పారేస్తున్నారు.

ఇలా ఈ సినిమా విడుదలకు మరో రెండు నెలల సమయం ఉంది కనుక పూర్తిగా వదిలేయకుండా అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ఉంటే సినిమాపై తప్పకుండా మంచి బజ్ క్రియేట్ అవుతుందని చెప్పాలి.

ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!