అది ప్రూవ్ చేయడానికే 15 కోట్లతో మళ్లీ పెళ్లి చేశారా.. వాళ్లిద్దరే విలన్లు అంటూ?

నరేష్, పవిత్ర లోకేశ్( Naresh Pavitra Lokesh ) జంటగా నటించిన మళ్లీ పెళ్లి మూవీ( Malli Pelli Movie ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.మూవీ చాలా బోరింగ్ గా ఉందని భారీ అంచనాలతో థియేటర్ కు వెళితే నిరాశ చెందడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈరోజు ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల కావడంతో మళ్లీ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది.

నరేష్ పవిత్ర నిజ జీవితం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

అయితే ఈ సినిమా సారాంశం ఏంటంటే నరేష్, పవిత్ర ప్రస్తుతం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నా తమ తప్పేం లేదని తాము పెళ్లి చేసుకున్న వ్యక్తులు పెట్టిన టార్చర్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రూవ్ చేయడాని ఈ సినిమాను తీశారు.

"""/" / థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా ఓటీటీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ఈ సినిమా నిర్మాతగా నరేష్ కు మాత్రం భారీ షాక్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.

ఈ సినిమా గురించి రమ్య రఘుపతి,( Ramya Raghupati ) పవిత్ర లోకేశ్ భర్త ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

"""/" / నరేష్, పవిత్ర తమ బయోపిక్ కాదని చెబుతున్నా సినిమా చూస్తుంటే మాత్రం బయోపిక్ చూసిన భావన కలుగుతుంది.

మళ్లీ పెళ్లి సినిమా రిజల్ట్ విషయంలో నరేష్ పవిత్ర ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మే నెలలో విడుదలైన సినిమాలన్నీ నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గమనార్హం.

నరేష్, పవిత్ర రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది.

పెళ్లైన 16 రోజులకే భర్త నిజస్వరూపం తెలిసింది.. ఎస్త‌ర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు!