శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్( Shekar Master ) ఒకరు కాగా ఈ కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీకి( Choreography ) ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఒక పాటకు 5 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే ఈ మధ్య కాలంలో శేఖర్ మాస్టర్ సాంగ్స్ లోని కొన్ని డ్యాన్స్ స్టెప్స్, డ్యాన్స్ మూమెంట్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మిస్టర్ బచ్చన్( Mr Bachchan Movie ) సినిమాలోని ఒక డ్యాన్స్ స్టెప్ విషయంలో శేఖర్ మాస్టర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.
ఆ తర్వాత పుష్ప2( Pushpa 2 ) సినిమాలోని పీలింగ్స్ సాంగ్( Peelings Song ) విషయంలో కూడా శేఖర్ మాస్టర్ విమర్శలు ఎదుర్కోవడం జరిగింది.
తాజాగా విడుదలైన దబిడి దిబిడి సాంగ్( Dabidi Dibidi Song ) డ్యాన్స్ స్టెప్స్ విషయంలో శేఖర్ మాస్టర్ విమర్శలు ఎదుర్కొన్నారు.
శేఖర్ మాస్టర్ కొన్ని స్టెప్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. """/" /
శేఖర్ మాస్టర్ విషయంలో విమర్శలు ఇదే విధంగా కొనసాగితే ఆయన ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శేఖర్ మాస్టర్ హిందీ, కన్నడ పాటలకు సైతం కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.
కానీ ఇప్పుడు మాత్రం శేఖర్ మాస్టర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" /
శేఖర్ మాస్టర్ ఈ విమర్శలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
శేఖర్ మాస్టర్ ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాలకు, యంగ్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ బెస్ట్ ఛాయిస్ కాగా ఆయన కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్ గతంలోలా అద్భుతం అని అనిపించుకోవడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
శేఖర్ మాస్టర్ భవిష్యత్తులో విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.
పచ్చి అల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?