అంత పెట్టి సమంత సినిమా ఎవరు చూస్తారు.. టికెట్ రేట్లు తగ్గించొచ్చుగా రాజుగారూ!

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా( Shaakuntalam Movie ) తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ నెల 14వ తేదీన 2డీ, త్రీడీలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా టికెట్ రేట్లు దారుణంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తక్కువ.పౌరాణిక సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే ప్రీమియం మల్టీప్లెక్స్ లలో 400 రూపాయలు ఉండగా హైదరాబాద్ లోని కొన్ని మల్టీప్లెక్స్ లలో ఇంటర్నెట్ ఛార్జీలతో కలిపి 325 రూపాయలుగా ఉంది.

కొన్ని సింగిల్ స్క్రీన్లలో 150, 200 రూపాయలకు అటూఇటుగా టికెట్ రేట్లు ఉన్నాయి.

దిల్ రాజు( Dil Raju ) శాకుంతలం సినిమా బడ్జెట్ 80 కోట్లు అని చెబుతున్నా అసలు లెక్కలు వేరేనని తెలుస్తోంది.

"""/" / ఈ సినిమా కోసం చేయించిన నగలను కూడా బడ్జెట్ లెక్కల్లో కలిపేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

శాకుంతలం సినిమాకు మరీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ టికెట్ రేట్లు కూడా సమస్య కాదు.

టాక్ అటూఇటుగా వస్తే మాత్రం ఈ టికెట్ రేట్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / సమంత విభిన్నమైన పాత్రలకు ఓకే చెబుతూ కెరీర్ పరంగా ఏ మాత్రం పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

సమంత రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.సమంత శాకుంతలం సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆమెకు మరిన్ని కొత్త ఆఫర్లు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిల్ రాజు టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై12, శుక్రవారం2024