చిరంజీవి సినిమాలు మానెయ్యాలంటూ కామెంట్లు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.అయితే ఈ సినిమా చిరంజీవి చెప్పిన విధంగానే రొటీన్ మాస్ మసాలా మూవీ అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలైన తర్వాత కొంతమంది చిరంజీవి గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి వయస్సుకు తగిన కథలు ఎంచుకోవాలని ప్రయోగాత్మక సినిమాలలో నటించాలని అభిమానులు సూచిస్తున్నారు.

అయితే ఇలా నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు చిరంజీవి అభిమానులు సైతం ఘాటుగా బదులిస్తున్నారు.

చిరంజీవి ప్రయోగాత్మక సినిమాలు చేసిన సమయంలో పాజిటివ్ ఫలితాలు దక్కలేదని కమర్షియల్ సినిమాలలో నటించిన సమయంలోనే సినిమాలు సక్సెస్ అవుతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అదే సమయంలో చిరంజీవి సినిమాలు సక్సెస్ సాధించకపోతే దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు తీయాలని భావించరని ఫ్యాన్స్ చెబుతున్నారు.

"""/"/ చిరంజీవి సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి 100 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరుగుతోందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీనియర్ హీరోలలో ఇప్పటికీ నంబర్ వన్ హీరో చిరంజీవి అని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

చిరంజీవి సినిమాలు బుల్లితెరపై కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

"""/"/ సినిమాలకు ఎప్పుడు గుడ్ బై చెప్పాలో చిరంజీవికి తెలుసని ఆయనకు ఎవరో సూచనలు చేయాల్సిన అవసరం చిరంజీవి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోమని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా 30 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

భోళా శంకర్ మూవీ చిరంజీవి ఖాతాలో మరో హిట్ నిలుస్తుందని అభిమానులు భావిస్తుండగా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

కల్కి మూవీలో కృష్ణుడి రోల్ ను చరణ్, ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారా.. అసలు నిజాలివే!