బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో బోయపాటి హిట్టు కొట్టలేడా.. విమర్శలకు జవాబు చెబుతాడంటూ?

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

తొలి సినిమాతోనే బోయపాటి శ్రీను సక్సెస్ ను సొంతం చేసుకోగా తులసి సినిమాతో బోయపాటి శ్రీను ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

సింహా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కెరీర్ పరంగా బోయపాటి శ్రీను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

బాలయ్య బోయపాటి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఈ కాంబో వచ్చిన మూడు సినిమాలు సక్సెస్ సాధించాయి.

"""/" / అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన దమ్ము, జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి.

సరైనోడు( Sarrainodu ) సినిమా కమర్షియల్ లెక్కల ప్రకారం హిట్ గా నిలిచినా ఈ సినిమాకు క్రిటిక్స్ మాత్రం దారుణంగా రేటింగ్స్ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో బోయపాటి హిట్టు కొట్టలేడని కామెంట్లు పలు సందర్భాల్లో వ్యక్తమయ్యాయి.

"""/" / స్కంద మూవీ ట్రైలర్ విషయంలో సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే బోయపాటి శ్రీను విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంది.సీనియర్ హీరోలకే కాదు యంగ్ జనరేషన్ హీరోలకు సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తానని బోయపాటి శ్రీను ప్రూవ్ చేయాల్సి ఉంది.

బోయపాటి శ్రీను పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

తర్వాత ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారని తెలుస్తోంది.

బోయపాటి శ్రీను పారితోషికం 13 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

బోయపాటి శ్రీను ఈ సినిమా తర్వాత అఖండ2( Akhanda 2 ) సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

బన్నీ బోయపాటి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన యూకే యువకుడు.. అతని మృతి వెనక ఎన్నో సందేహాలు..