అన్ స్టాపబుల్ బూతు షోనా.. ఈ షో గురించి అలాంటి కామెంట్లు వస్తున్నాయా?

తెలుగులో ఎన్నో ప్రముఖ ఓటీటీలు ఉన్నా ఆ ఓటీటీలో ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా ఓటీటీ పాపులర్ అయింది.

అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేయడం, బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం, తక్కువ సమయంలోనే హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ షో రేంజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

అయితే కొంతమంది మాత్రం అన్ స్టాపబుల్ షో బూతు షో అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

హీరోలు ఈ షోకు హాజరైతే ప్రధానంగా హీరోయిన్లతో ఎఫైర్ గురించి ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

అన్ స్టాపబుల్ షోలో బోల్డ్ ప్రశ్నలు ఎక్కువయ్యాయని కొంతమంది చెబుతున్నారు.షోకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయకుండా ప్రసారం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొంతమంది సెలబ్రిటీలు ఈ షోలో అడుగుతున్న ప్రశ్నల వల్ల ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందుతోంది.

"""/"/అన్ స్టాపబుల్ షో ప్రభాస్ ఎపిసోడ్ కు 12 గంటల్లో ఏకంగా 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రావడం గమనార్హం.

ఈ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇతర ఓటీటీలు సైతం తక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలను కొనుగోలు చేయడం కూడా ఆహా ఓటీటీకి మరింత ప్లస్ అవుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లలో ఆహా కంటెంట్ ను చూసే అవకాశం ఉండటం ఈ షోకు మరింత ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇతర ఓటీటీలు సైతం ప్రస్తుతం అన్ స్టాపబుల్ తరహా షోలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??