తెలుగు సీతకి ఈమెకి అస్సలు పొంతన లేదు.. ఆదిపురుష్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్!
TeluguStop.com
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి సినిమా ఎలా ఉన్నా విడుదలకు ముందు రిలీజైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి.
సినిమాలో బాగున్న కంటెంట్ ను మాత్రమే టీజర్, ట్రైలర్ లో చూపించడం జరుగుతుంది.
అయితే ఆదిపురుష్ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
సీత పాత్రలో కృతిసనన్( Kritisanan ) నటించగా ఆమె పోస్టర్ కు నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
కృతిసనన్ నటించిన సీత పోస్టర్ పౌరాణిక సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఏ మాత్రం నచ్చేలా లేదు.
తెలుగులో గతంలో సీత పాత్రను పోషించిన నటీమణులతో పోల్చి చూస్తే మాత్రం ఈ సీత అస్సలు సాటిరాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు సినిమాలలో సీత పాత్ర అంటే భారీ అంచనాలు ఉంటాయి. """/" /
అయితే ఆదిపురుష్( Adipurush ) సీత మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు.
లవకుశ సినిమాలో అంజలీ దేవి సీత పాత్రలో నటించి అద్భుతమైన అభినయంతో మెప్పించారు.
1963లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన సంపూర్ణ రామాయణం సినిమాలో సీత పాత్రలో చంద్రకళ నటించి మెప్పించారు.
"""/" /
బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన సీతా కళ్యాణం( Sita Kalyanam ) అనే మరో సినిమాలో జయప్రద సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.
శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార సీత పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.సీతారామ కళ్యాణం సినిమాలో సీత పాత్రలో గీతాంజలి నటించి ఆకట్టుకున్నారు.
శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో సీత పాత్రలో సంగీత నటించగా, దేవుళ్లు సినిమాలో లయ, శ్రీరామదాసు సినిమాలో అర్చన సీత పాత్రలో నటించారు.
ఈ సీత పాత్రలను మరిపించి మెప్పించడం కృతి సనన్ కు సాధ్యమవుతుందో లేదో చూడాలి.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…