ఆచార్యను నిజంగానే అన్ని రూ.కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారా.. అస్సలు నమ్మేలా లేదుగా?

ఆచార్య సినిమా విడుదలకు ముందు ఆచార్య సినిమా బడ్జెట్ గురించి జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా వడ్డీ భారమే 50 కోట్ల రూపాయలు అంటూ చిరంజీవి చేసిన సంచలన వ్యాఖ్యల గురించి జోరుగా చర్చ జరిగింది.

అయితే సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని చెబుతున్నారు.

ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు ఖర్చైందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.140 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు ఒకేచోట షూట్ చేశారనే విధంగా ఉండటం గమనార్హం.

ఈ సినిమాలోని పాటలకు కూడా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ఖర్చు చేసినట్టు అనిపించలేదు.

ఆచార్య బడ్జెట్ గురించి జరిగిన ప్రచారం నిజమేనా అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేహాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ధర్మస్థలి సెట్ లో, అడవిలో మినహా ఇతర ప్రాంతాలలో ఎక్కువ సన్నివేశాలను షూట్ చేసినట్టు కూడా అనిపించలేదు.

"""/"/ ఆచార్య సినిమా చూసిన ప్రేక్షకులను ఎన్నో సందేహాలు వేధిస్తున్నాయి.ఈ సినిమాకు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించడం కూడా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఫ్లాప్ సినిమాకు సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆచార్య ఫ్లాప్ గురించి మరికొన్ని రోజుల పాటు చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

"""/"/ ఆచార్య ఫ్లాప్ చిరంజీవి, చరణ్ కెరీర్ లపై పెద్దగా ప్రభావం చూపకపోయినా కొరటాల శివ కెరీర్ పై మాత్రం ఈ సినిమా ప్రభావం తప్పకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

ఆచార్య హిట్టై ఉంటే బాగుండేదని మెగా అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఆచార్య తొలిరోజు 35 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తోంది.