మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం కొత్త ప్లాట్ఫాం ఆవిష్కరించిన అంబానీ భార్య..!

నేడు ప్రపంచం మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతే లక్ష్యంగా రిలయన్స్ సంస్థల పౌండేషన్ చైర్ పర్సన్ ముఖేష్ అంబానీ భార్య నితు అంబానీ కొత్త సామాజిక వేదికను మొదలు పెట్టింది.

ఈ కొత్త ఫ్లాట్ఫామ్ కు నీతూ అంబానీ "హెర్ సర్కిల్" గా నామకరణం చేశారు.

ఇందుకు సంబంధించి ఈ మాధ్యమంలో కేవలం మహిళలకు సంబంధించిన విషయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని.

అందులో ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్, బ్యూటీ లాంటి వివిధ అంశాలకు సంబంధించి ఆర్టికల్స్ ను చదవడంతో పాటు వాటికి సంబంధించిన వీడియోలను కూడా అందులో పొందుపరుస్తారు.

వీటితో పాటు ఆడవారికి అవసరమైతే చదువు పరంగా, లీడర్ షిప్, ఫైనాన్స్, ఆరోగ్యం, వెల్ నెస్ లాంటి విషయాలలో కూడా రిలయన్స్ ప్యానెల్ సంబంధించిన నిపుణులను వారికి సమాధానాలు అందజేస్తున్నట్లు ఆవిడ తెలియజేశారు.

ఈ సందర్భంగా నీతూ అంబానీ మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని.

తాను చాలా నేర్చుకున్నానని వాటిని అన్నింటిని తాను ఇతరులకు కూడా నేర్పించాలని.వాటితో పాటు ఇతరులకు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పోర్టల్ ప్రారంభించినట్లు ఆవిడ తెలియజేశారు.

ఈ హెర్ సర్కిల్.ఇన్ లో చేరి మహిళలు వారి ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలని ఆవిడ సూచించారు.

తాను మహిళల కోసం ఇలాంటి మాధ్యమ వేదికను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆవిడ తెలియజేశారు.

ప్రతి ఒక్క మహిళ ఈ వేదికను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆవిడ సూచించారు.

ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నట్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉందని క్రమంగా ఇతర భాషల్లోకి కూడా తీసుకు రాబోతున్నట్లు ఆవిడ తెలిపారు.

వైరల్: పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యాని ఆర్డర్ చేసిన జొమాటో.. చివరికి..?!