లిప్ కిస్ ఇచ్చి డెటాల్ తో నోరు శుభ్రం చేసుకున్నా … నటి కామెంట్స్ వైరల్!

సీనియర్ నటి నీనా గుప్తా( Neena Guptha ) తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma) , తమన్నా ( Tamannah )జంటగా నటించిన లస్ట్ స్టోరీస్2 ( Lust Stories) సిరీస్ లో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సిరీస్ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లిప్ కిస్( Lip Kiss ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన సినీ కెరీర్లు మొదటిసారి ఆన్ స్క్రీన్ లో లిప్ కిస్ ఇవ్వడం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నటీనటులు అన్న తర్వాత కథ డిమాండ్ చేస్తే ప్రతి ఒక్క సన్నివేశంలోనూ నటించాల్సి ఉంటుంది.

"""/" / ప్రస్తుత కాలంలో లిప్ లాక్ సన్నివేశాలు ప్రతి ఒక్క సినిమాలోని సర్వసాధారణమయ్యాయి.

కానీ ఒకప్పుడు లిప్ లాక్ సీన్స్ చేయాలి అంటే ఏ హీరోయిన్ కూడా ఒప్పుకునే వారు కాదు.

అయితే మొదటిసారి నీనా గుప్తా లిప్ కిస్ నటించిన సన్నివేశం గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.

కొన్నేళ్ల క్రితం న‌టుడు దిలీప్ ధావ‌న్( Deelip Dhavan ) క‌లిసి ఓ సీరియ‌ల్‌లో న‌టించాను.

ఈ సీరియల్ లో భాగంగా మా ఇద్దరి మధ్య లిప్ కిస్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

బహుశా ఇండియన్ టీవీ చరిత్రలో అదే మొదటి లిప్ కిస్ సీన్ కావచ్చు.

దీంతో ఆ రోజు రాత్రి మొత్తం తనకు నిద్ర పట్టలేదని తెలిపారు. """/" / ఇలా లిప్ కిస్ సన్నివేశంలో నటించాలన్న విషయం నన్ను చాలా అసౌకర్యానికి గురిచేసిందని తెలియజేశారు.

తనకు తాను ఎంత సమర్థించుకున్న చాలా కంగారు పడ్డానని ఈమె తెలిపారు.అయితే మరుసటి రోజు లిప్ కిస్ సన్నివేశం షూటింగ్ పూర్తి కాగానే వెంటనే వెళ్లి నేను డెటాల్ ( Detol )తో నోటిని శుభ్రం చేసుకున్నానని,అది నాకు చాలా కష్టంగా అనిపించడమే కాకుండా తెలియని వారిని ముద్దు పెట్టుకున్నాను అన్న ఆలోచన తనని కొద్దిరోజుల పాటు వెంటాడిందని ఈ సందర్భంగా నీనా గుప్త చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..