వేప నూనెతో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టండిలా!

హెయిర్ ఫాల్ లేదా జుట్టు రాలిపోవ‌డం.నేటి కాలంలో దాదాపు డ‌బ్బై శాతం మంది ఈ స‌మ‌స్యను ఫేస్ చేస్తున్నారు.

జుట్టు రాలిపోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.పోష‌కాహారం లోపం, కాలుష్యం, మారిన జీవ‌న శైలి ఇలా ఎన్నో కార‌ణాల వ‌ల్ల హెయిర్ లాస్ అవ్వాల్సి ఉంటుంది.

ఇక ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునే ర‌క‌ర‌కాల నూనెలు వాడుతూ ఉంటారు.షాంపూ మారుస్తూ ఉంటాయి.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌క‌పోయితే బాధ ప‌డుతుంటారు.అయితే హెయిర్ ఫాల్‌ను నివారించ‌డంలో వేప నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

వేప నూనెను ఎలా తీస్తార‌నే సందేహం చాలా మందిలో ఉంటుంది.నిజానికి వేప కాయ‌ల్లోని గింజ‌ల నుండి నూనె తీస్తారు.

ఇదే వేప నూనె.ఈ వేప నూనెను సబ్బుల తయారీలో విరివిగా ఉప‌యోగిస్తుంటారు.

అలాగే ఆయుర్వేదంలో మ‌రియు ప‌లు ర‌కాల మందుల త‌యారీలోను కూడా వేప నూనెను యూజ్ చేస్తారు.

అయితే ఈ వేప నూనె హెయిర్ ఫాల్‌ను దూరం చేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

"""/"/ వేప నూనెను ఎలా ఉప‌యోగించాలంటే.ఒక స్పూన్ వేప నూనెకు ఒక స్పూన్ బాదం నూనె క‌లిపి.

జుట్టు బాగా ప‌ట్టించాలి.అనంత‌రం ఐదు నిమిషాల పాలు త‌ల‌ను మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి.పెర‌గ‌డం మొద‌లవుతుంది.

ఇలా వేప నూనె రాయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

ఇక వేప నూనె జుట్టుకే కాదు.చ‌ర్మానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మొటిమ‌ల‌తో బాధ ప‌డుతున్న వారు వేప నూనె మ‌రియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.

ముఖానికి అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా మొటిమ‌లు త‌గ్గిపోతాయి.అలాగే న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!