పాదాల పగుళ్లతో ఇబ్బందా.. వేపతో చెక్ పెట్టేయండిలా!
TeluguStop.com
పాదాల పగుళ్లు.ఈ చలి కాలంలో చాలా మందిని కామన్‌గా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
అప్పటి వరకు అందంగా ఉండే పాదాలు.శీతాకాలం వచ్చిందంటే చాలు పగుళ్లతో అందహీనంగా మారిపోతుంటాయి.
ఇక పాదాలు పగిలాయంటే.ఆ సమయంలో వచ్చే నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది.
మరియు నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.అయితే పాదాలు పగుళ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
చలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలను సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం, మధుమేహం, థైరాయిడ్ ఇలా రకరకాల కారణాల వల్ల పాదాల పగుళ్లు ఏర్పడుతుంటాయి.
అయితే పాదాల పగుళ్లను నివారించడంలో వేప ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండే వేప ఆకులు.
అనేక మందుల తయారీలో, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడుతుంటారు.ఇక పాదాల పగుళ్లకు చెక్ పెట్టడంలో వేప ఆకులు సూపర్‌గా ఉపయోగపడతాయి.
మరి వేప ఆకులను పాదాలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
ముందుగా కొన్ని వేప ఆకులను తీసుకుని.మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.
గంట తర్వాత గోరు వెచ్చని నీటితో పాదాలకు శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే.
వేపలో ఉంటే యాంటీఫంగల్ లక్షణాలు పాదాల పగుళ్లను క్రమంగా నివారిస్తుంది. """/"/
ఇక వేప ఆకులు, తులసి ఆకులు సమానంగా తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఆ పేస్ట్‌ను పాదాలకు పట్టించి.అరగంట పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల పదాల పగుళ్లు తగ్గడమే కాకుండా.
ఫస్ట్ టైమ్ గులాబ్ జామూన్ రుచిచూసిన కొరియన్ అమ్మాయి.. ఆమె రియాక్షన్ వైరల్..