దురదకి వేపతో చెక్ పెట్టండి ఇలా

దురద చాలా మందికి ఎదురయ్యే సమస్యే.కానీ కొంతమందిని ఈ సమస్య అధికంగా వేదిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా ఈ సమస్యకి ప్రధానమైన కారణం ఇన్ఫెక్షన్లు.మనం స్నానం చేసే నీరు శుభ్రంగా లేకపోయినా.

తినే ఆహారం ,త్రాగే నీరు ,ఇలా ఏదోఒక విషయం దురదకి కారణం అవుతుంది.

ఈ పరిస్థితి నించీ బయటపడాలి అంటే కొన్ని చిట్కాలని ఫాలో అయితే చాలు.

దురదకి సరైన మందు వేప .వేపనునే ద్వారా దురదని తగ్గించుకోవచ్చు.

పసుపు తో కూడా దురదల్ని తగ్గించవచ్చు.ఎందుకనగా పసుపు,వేప రెండిటిలో కూడా యాంటిబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ రెండిటి మిశ్రమాన్ని ముద్దగా నూరి వంటికి పట్టించి స్నానం చేస్తే చాలు.

దురదలు తగ్గుతాయి.ఇలా వారానికి ఒకసారి చేయాలి.

ఉసిరికాయ పొడి ,ఆవు నెయ్యి తో కలిపి.మూడు పూటలా తీసుకుంటే చాలు దురదలు రావు.

అంతేకాదు ఇంకా వేప, పసుపు ముద్దకు సున్నిపిండి కలిపితే ఒంటి మీద వున్న మురికి పోతుంది.

మృత కణాలు తొలగిపోతాయి.చర్మం శుభ్రం అవుతుంది.

కొబ్బరినూనెలో వేపాకు రసం కలిపి బాగా కాచి శరీరానికి రాసుకుంటే దురద తొలగిపోతుంది నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా చర్మ వ్యాధులని పోగొట్టుకోవచ్చు.

ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?