12 సంవత్సరాల తర్వాత పూలు పూసిన మొక్క… ఫోటో వైరల్!

సాధారణంగా ఏ పూల మొక్కైనా మూడు నెలలకో, నాలుగు నెలలకో పుష్పిస్తుంది.అలా పుష్పించిన తరువాత కొన్ని నెలలు పూలు పూచి ఆ తరువాత పూలు పూయడం ఆపేస్తుంది.

అయితే ఒక మొక్క మాత్రం 12 ఏళ్లకు ఒకసారి పుష్పిస్తుంది.ఈ అరుదైన మొక్కలు దేశంలో పలు ప్రాంతాల్లో పుష్పిస్తూ చర్చనీయాంశం అయ్యాయి.

తాజాగా మధ్యప్రదేశ్ లోని పచ్ మరి ప్రాంతంలో నీల్ పురంజి పుష్పాలు కనిపించాయి.

చాలా అరుదుగా మాత్రమే వికసించే నీల్ కురుంజి పుష్పాలను చూడటానికి మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు.

కేరళలోని మన్నార్ లో 2006 సంవత్సరంలో చివరిసారి ఈ నీల్ కురుంజి పుష్పాలు కనిపించాయి.

దేశంలోని రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా పుష్పాలు వికసిస్తుంటాయి.కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఈ మొక్కలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి.

నీల్ కురూంజీ అంటే గుబురుగా పెరిగే గడ్డి జాతి మొక్కకు పూచే పూలు.

బ్లూ కలర్ లో ఈ పూలు ఉంటాయి.1838 సంవత్సరంలో తొలిసారి ఈ పూలను కనుగొన్నారు.

సౌత్ ఇండియాలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తాయి.పూలు పూచిన కొన్ని రోజులకే చనిపోవడం ఈ మొక్కల ప్రత్యేకత.

పువ్వు పూచిన తరువాత ఆ ప్రాంతమంతా విత్తనాలు వెదజల్లినట్లుగా కనిపిస్తుంది.వైద్య నిపుణులు ఈ పువ్వుకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.

ఆయుర్వేదం మొండి వ్యాధులను కూడా ఈ పువ్వు నయం చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఆయుర్వేద నిపుణులు ఈ పువ్వు ఏ రోగాన్నైనా నయం చేయగలదని తెలుపుతున్నారు.ఎన్నో ఔషధ గుణాలు ఈ అరుదైన పువ్వులు ఎంతో ఖరీదు చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్27, శనివారం 2024