'భారత సత్తా'చాటి చెప్పిన మరో 'ఇండో అమెరికన్..'

భారతీయులు ఎప్పటికప్పుడు విదేశాలలో తమ అత్యన్నతమైన ప్రతిభని చాటుతూనే ఉంటారు, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

గత నెలలో ట్రంప్ ఓ మహిళా అధికారికి అమెరికా కీలక శాఖ అయిన ఆర్ధిక శాఖలో అత్యున్నత పదవిని కట్టబెట్టారు తాజాగా ట్రంప్ మరొక భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టారు.

ఆ వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమెరికా ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్ (ఫెర్క్) చైర్మన్‌గా భారత సంతతికి చెందిన నీల్ ఛటర్జీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమిస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకుముందు చైర్మన్‌గా ఉన్న కెవిన్ మైక్ ఇంటైర్ అనారోగ్య కారణాల రీత్యా ఈ నెల 22న వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

దాంతో ఇప్పటికే ఫెర్క్ కమిషనర్‌గా ఉన్న నీల్ ఛటర్జీ ఇకపై చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఫెర్క్ కమిషనర్‌గా నీల్ ఛటర్జీ నియామకాన్ని గతేడాది ఆగస్టులో అమెరికా సెనెట్ ధ్రువీకరించింది.

,,కాగా ప్రస్తుతం ముగ్గురు ఫెర్క్ కమిషనర్లలో ఆయన ఒకరు.గతంలో మైక్ ఇంటైర్ ఫెర్క్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్ వరకు నీల్ ఛటర్జీ సంస్థ చైర్మన్‌గా కొద్దికాలం పని చేశారు.

అమెరికాలో ఎన్నో కీలక పదవులని చేపట్టిన ఆయన ఇప్పుడు ఫెర్క్ ఛైర్మెన్ గా నియమిపబడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

RC 16 నుంచి తప్పుకున్న రెహమాన్… క్లారిటీ ఇచ్చిన మేకర్స్?