‘గెరిల్లా మాల్వేర్’ ఆండ్రాయిడ్ ఫోన్లను కాటేస్తోందా… 89 లక్షల ఫోన్లకుపైగా!

అవును, మీరు విన్నది నిజమే.ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, థాయ్‌లాండ్, రష్యా మరియు యుఎస్‌తో సహా అనేక దేశాల వినియోగదారులకు దీనినుండి ముప్పు ఉందని సర్వేలు చెబుతున్నాయి.

సెల్ ఫోన్ కొన్న మొదట్లోనే ఈ మాల్వేర్ బారిన పడినట్లు రిపోర్టులు చెప్తున్నాయి.

అంటే మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడే ఫోన్లలో ఈ మాల్వేర్ లు నిక్షిప్తమై ఉంటున్నాయి.

ఇది వినియోగదారుని వ్యక్తిగత వివరాలను దోచేయడంలో మంచి దిట్ట.అంతేకాకుండా మీరు మొబైల్ వాడినా వాడకపోయినా బ్యాటరీ వినియోగం మాత్రం జరిగిపోతూ ఉంటుందని భోగట్టా.

"""/" / వ్యక్తిగత సమాచారం( Personal Data ) భద్రతా పరిశోధకుల ప్రకారం, ఈ గెరిల్లా మాల్వేర్( Guerilla Malware ) తనను తాను అప్‌డేట్ చేసుకుంటుందట.

అంతేకాకుండా వ్యక్తిగత డేటాను సేకరించడానికి బాధితుడి ఫోన్‌లో అదనపు సాఫ్ట్‌వేర్‌ను ఇన్ స్టాల్ కూడా చేసేయగలదట.

దీని కారణంగా, దాదాపు 8.9 మిలియన్ల ఆండ్రాయిడ్ ఫోన్‌లు గెరిల్లా మాల్వేర్ బారిన పడ్డాయని, 50కి పైగా తయారీదారుల హ్యాండ్‌సెట్‌లు ప్రభావితమయ్యాయని సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో( Trend Micro ) ఇటీవల రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

"""/" / ఇకపోతే తాజాగా ముగిసిన బ్లాక్ హ్యాట్ ఆసియా 2023 భద్రతా సదస్సులో ఈ వివరాలు వెలువడ్డాయి.

ఈ గెరిల్లా మాల్వేర్ వెనుక ఉన్న మాల్వేర్ ఆపరేటర్, 2016లో ఫోన్‌లలో కనుగొనబడిన ట్రియాడా మాల్వేర్‌తో పోలికలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ రిపోర్ట్ ప్రకారం భద్రతా సంస్థ, ఈ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన ఫోన్ల కంపెనీలను మాత్రం పేర్కొనలేదని గమనించాలి.

గెరిల్లా మాల్వేర్ మొదటిసారిగా 2018లో స్మార్ట్‌ఫోన్‌లలో కనుగొనబడింది.గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన యాప్‌లలో ఈ మాల్వేర్ కనుగొనబడింది.

యూకే యూనివర్సిటీలలో శాలరీలు ఇంత తక్కువా.. ఎన్నారై ప్రొఫెసర్ ఆవేదన!