చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది.

దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు.

చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు సమావేశం( BJP Leaders Meeting ) అయ్యారు.

ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచార శైలితో పాటు భవిష్యత్ కార్యాచరణ మరియు క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు.

అదేవిధంగా పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైనా కూటమి నేతలు చర్చించారని సమాచారం.

ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!