వైరల్: రూ.5 కోసం పెద్ద యుద్ధమే జరిగింది.. బస్సు కండక్టర్‌కి ప్రయాణికుడుకి ఫైట్ చూడండి!

రూ.5 కోసం యుద్ధం జరగడం ఏమిటి అని అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమే.

తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ ఏదో సినిమాలో చెప్పినట్టు ఇక్కడ నిజంగానే రూ.5 కోసం పెద్ద యుద్ధమే జరిగింది.

ఓ ప్రయాణికుడి నుంచి RTC బస్సు కండక్టర్‌ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు.

తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇవ్వడం వలన అతనికి అదనంగా రూ.

5 ఛార్జ్ పడ్డాయి.ఇక ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడితో కండక్టర్ వాగ్వివాదానికి దిగడంతో ఈ గొడవ చెలరేగింది.

వివరాల్లోకి వెళ్తే… ఎన్సీసీ యూనిఫాంలో ఉన్న ఓ కుర్రాడు మధ్యప్రదేశ్ భోపాల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ బస్టాప్ వద్ద తన గమ్యానికి వెల్లసిన బస్సు ఎక్కాడు.

తరువాత కండక్టర్ ని టికెట్ ఇవ్వాలని అడిగాడు.అతడు దిగాల్సిన స్టాపునకు రూ.

10 టికెట్ మాత్రమే అతగాడు తీసుకోవాలి.అయితే, కండక్టర్ రూ.

15 టికెట్ కొట్టాడు.ఎందుకంటే ఆ కుర్రాడు దిగాల్సిన స్టాపు కంటే దూరంగా ఉండే స్టాపునకు కండక్టర్ టికెట్ ఇచ్చాడట.

దీంతో తన రూ.5 వెనక్కి ఇవ్వాలని ఆ కుర్రాడు అడిగాడు.

అయితే, తాను ఇవ్వబోనని కండక్టర్ చెప్పాడు.దీంతో వాగ్వివాదం చెలరేగింది.

"""/" / ఇక కండక్టర్ తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కుర్రాడు అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.

దాంతో కండక్టర్ బస్సులోని సీటుపై అమాంతం కూలబడిపోయాడు.అనంతరం ఆ కుర్రాడు బస్సు దిగి వెళ్లిపోగా ఆ కుర్రాడి వెనకాలే కండక్టర్ పరుగులు తీశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.కండక్టర్లకు అధికారులు టార్గెట్లు విధిస్తుండడంతోనే ప్రయాణికులకు ఇలా అధిక రేటు టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ నుంచి ఫిర్యాదు అందింది.

స్కూల్ పాఠ్యపుస్తకాలలో లెసన్స్ గా మారబడిన నటీనటుల జీవితాలు