బోయిన్పల్లి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎన్ క్వా స్ బృందం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్ క్వాస్ బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఎన్ క్వాస్ గుర్తింపు లభించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు,ఎన్ క్వస్ జిల్లా మేనేజర్ విద్యాసాగర్, బోయిన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వస్తులపై దృష్టి సారించారు,ఎన్ క్వాష్ గుర్తింపు పొందడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయడంతో కేంద్రం నుంచి ఇద్దరు అధికారులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రికార్డులు చూశారు.

ఆరు విభాగాల్లో ఏ నిమిది అంశాలపై చర్చించారు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నా ఓపి పేషెంట్ల సంఖ్య ,ఆరోగ్య కేంద్రంలో లేబర్ ల్యాబ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ తదితర అంశాలపై పరిశీలన చేశారు గుర్తింపు పొందడానికి అవసరమైన సూచనలు సలహాలు వైద్య సిబ్బందికి అందించారు.

ఈ కార్యక్రమం లో డాక్టర్ రేణు బ్యాన, సజిత్ జాన్, జిల్లా ప్రాజెక్ట్ అధికారిని ఉమా,డాక్టర్ మహేష్, తదితరులు ఉన్నారు.

హైదరాబాద్ కు కవిత … నేడు కేసిఆర్ తో భేటీ