ఆ ఏరియాలో చరణ్ కంటే బాలయ్య తోపు అంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాలు విడుదల దానికి పోటీ పడుతూ ఉంటాయి.

సంక్రాంతి సీజన్ కి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.ఈ సంక్రాతికి చిత్రాలను విడుదల చేయడం కోసమే దర్శకులతో పాటు హీరోలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు.

ఎందుకంటే అప్పుడు వరుసగా సెలవలు ఉండడంతో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు.

అలా వచ్చే ఏడాది కూడా చాలా పెద్ద చిత్రాలు పోటీలో నిలవనున్నాయి.ఇకపోతే 2025 సంక్రాంతికి కూడా ఎప్పటి లాగానే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

"""/" / ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న NBK109 మూవీ ( NBK109 )సంక్రాతి బరిలో నిలిచినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి.

వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

వాస్తవానికి ప్రతి ఏడాది సంక్రాంతికి మెగా, నందమూరి హీరోల మధ్య పోటీ ఆసక్తికంగా మారుతూ ఉంటుంది.

గతంలో చిరంజీవి, బాలకృష్ణ( Chiranjeevi, Balakrishna ) చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలిచి పండుగను రసవత్తరంగా మార్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి మాత్రం చిరు స్థానంలో ఆయన కుమారుడు రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ బాలయ్య మూవీతో పాటు బరిలో నిలవబోతున్న విషయం తెలిసిందే.

"""/" / గేమ్ చేంజర్( Game Changer ), బాలయ్య సినిమాకు మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో వీటిలో ఏది హిట్ అవుతుంది? దేనికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? ఏ మూవీకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది? అనే అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఏరియా బిజినెస్ విషయంలో చరణ్ కంటే బాలయ్య దే పైచేయి అన్న వార్తలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ఏరియాకు ప్రత్యేకత ఉంది.అయితే, ఇక్కడ టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు మాత్రమే ప్రభావాన్ని చూపిస్తున్నారు.

అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు.ఈయన నటించిన చిత్రాలకు అక్కడ భారీ రెస్పాన్స్ వస్తుంది.

అందుకే NBK109 సినిమాకు ఏకంగా 19 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ అని సమాచారం.అలాగే రామ్ చరణ్‌ కు కూడా సీడెడ్‌ లో మంచి మార్కెట్ ఉంది.

కానీ గేమ్ చేంజర్ సినిమాకు అక్కడ కేవలం రూ.15 కోట్లు బిజినెస్ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

అలా ఈ ఏరియాలో బాలయ్య.చరణ్‌పై పైచేయి చూపించాడని సమాచారం.

ఇప్పుడు దీన్ని నందమూరి ఫ్యాన్స్ హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

వీడియో కాల్‌లో భర్త ఉండగా ఫోన్‌ని పుణ్యజలాల్లో ముంచేసిన భార్య.. వీడియో చూస్తే నవ్వాగదు..