‘NBK107’ షూటింగ్ కు అడ్డంకులు.. అందుకే ప్లాన్ మార్చరట..!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకుని చాలా రోజుల తర్వాత విజయం అందిన ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.

ఈయన నటిస్తున్న 107వ సినిమా నుండి ఇటీవలే సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా చేస్తున్నాడు.

గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా మనం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.

ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మొదట్లో కొంత భాగాన్ని యుఎస్ లో షూట్ చేసిన విషయం విదితమే.

ఇక ఇప్పుడు కూడా యుఎస్ లోనే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసారు.

అయితే యుఎస్ లో షూట్ చేయడానికి వీసా సమస్యలు తలెత్తాయట.దీంతో ఇప్పుడు వీరు ప్లాన్ చేంజ్ చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.

"""/"/ యుఎస్ లో జరగాల్సిన షెడ్యూల్ ను మేకర్స్ వేరే దేశానికీ మార్చేసారట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ టర్కీలో జరుపుకోనుందట.దీనికి సన్నాహాలు కూడా చేస్తున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కోర్టు ముందుకు సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితులు..!