NBK107 నుండి అదిరిపోయే పోస్టర్.. కత్తిపట్టి విధ్వంసం సృష్టిస్తున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

చాలా రోజుల తర్వాత బాలయ్యకు మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ సమీపంలో షూటింగ్ చేస్తున్నారు.ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం విదితమే.

ఇక తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి అని అందరికి తెలుసు. """/"/ ఈ సందర్భంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ మేరకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు పోస్టర్ రిలీజ్ చేస్తూ.

''విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ.

బాలయ్య 107 నుండి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం అంటూ తెలిపారు. """/"/ ఈ పోస్టర్ లో బాలయ్య ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కత్తి పట్టుకుని ఊచకోత కోస్తూ విధ్వంసం సృష్టిస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ నందమూరి ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.ఈ పోస్టర్ తో ప్రేక్షకులకు మాస్ ట్రీట్ అందించాడు గోపీచంద్ మలినేని.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?