బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ,( Balakrishna ) బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK109.

ఈ సినిమాకు సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు.కానీ ఈ టైటిల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ సినిమా టైటిల్ రివిల్ అయ్యే సమయం ఆసన్నమైంది అంటూ ఒక పోస్ట్ చేశారు మూవీ మేకర్స్.

దీంతో ఆ పోస్ట్ కి వస్తా వరి లవ్వడంతో బాలయ్య బాబు బాబి( Bobby ) కాంబినేషన్లో సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? """/" / ఆ సినిమా టైటిల్ ఏమై ఉంటుందో అని అభిమానులు ఆలోచిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదే అదనుగా కొందరు ఈ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు టైటిల్‌ను సోషల్ మీడియానే డిసైడ్ చేస్తోంది.

నాలుగైదు టైటిల్స్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడం, అందులో నుంచి ఒక టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేయడం వంటిది కొన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది.

ఇప్పుడు బాలయ్య, బాబీల కాంబో సినిమాకు కూడా కొన్ని పేర్లు సోషల్ మాధ్యమాలలో దర్శనమిస్తున్నాయి.

"""/" / అయితే బాలయ్యకు ఉన్న సింహం సెంటిమెంట్‌తో టైటిల్ ఉంటుందా? లేదంటే ఈసారి మార్పు ఉంటుందా? అనేలా ఒకవైపు ఆలోచనలు నడుస్తుంటే.

మరో వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌కు అదిరిపోయే టైటిల్స్‌ను సెట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు వీర మాస్,( Veera Mass ) అసురుడు( Asurudu ) అనే టైటిల్స్ బాగా వినిపించాయి.

ఇప్పుడు కొత్తగా డిమాన్( Demon ) అనే టైటిల్ బాగా వైరల్ అవుతోంది.

డిమాన్ అంటే దెయ్యం అని అర్థం.మరి ఇందులో ఏ టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

ఇవి కాకుండా దర్శకుడు బాబీ తన మార్క్‌ని ప్రదర్శిస్తూ వేరే టైటిల్‌ని ఫిక్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరి ఈ సినిమాకు ఏ టైటిల్ని ఫిక్స్ చేస్తారో చూడాలి మరి.

బాబు గారి నిర్ణయం :  ఏపీలో ఇసుక ఫ్రీ ఫ్రీ