వివేక్ తో మరో సినిమా చేస్తానంటున్న నజ్రియా..!
TeluguStop.com

మళయాళ భామ నజ్రియా తెలుగులో రాజా రాణి సినిమాతో అలరించింది.అసలైతే ఆమెకు నాని అంటే సుందరానికీ సినిమానే తొలి తెలుగు సినిమా అని చెప్పొచ్చు.


కానీ ఆమెకు ఆల్రెడీ రాజా రాణి సినిమాతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.


అయితే ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ తో పెళ్లవడంతో ఇక ఆమె తెలుగు ఎంట్రీ ఉండదని అనుకున్నారు.
కానీ నాని అంటే సుందరానికీ సినిమాతో ఆమె తెలుగు తెరంగేట్రం చేస్తుంది.ఈ సినిమాలో లీల పాత్రలో నజ్రియా తన నటనతో ఆకట్టుకోనుంది.
జూన్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ అంతా చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నజ్రియా అంటే సుందరానికీ డైరక్టర్ వివేక్ ఆత్రేయ మీద ప్రశంసల వర్షం కురిపిస్తుంది.
అతను చాలా టాలెంట్ ఉన్న డైరక్టర్ అని అతని సినిమాలు చాలా నిజాయితీగా ఉంటాయని.
అతనితో సినిమా అంటే ఈసారి ఆలోచించకుండా సైన్ చేస్తానని అంటుంది నజ్రియా.తెలుగులో సినిమా చేయడానికి ఇంతకుముందు చాలా ఆఫర్లు వచ్చినా సరైన కథ దొరకలేదని.
కానీ వివేక్ ఆత్రేయ సినిమా అంటే కథ వినకుండానే ఓకే చేస్తానని అంటుంది నజ్రియా.
నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!