Nayanthara: నటనకి గుడ్ బై చెప్పి అలాంటి పని చేయబోతున్న నయనతార..షాక్ లో ఫ్యాన్స్..!!

లేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో ఎంతో మంచి క్రేజ్ సంపాదించిన నయనతార(Nayanthara) గురించి ప్రస్తుతం ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వార్త రావడానికి ప్రధాన కారణం నయనతార పెట్టిన ఒక పోస్టే.

ఆమె పెట్టిన పోస్టును బట్టి చాలామంది నెటిజన్లు నయనతార నటనకు గుడ్ బై చెప్పి అలాంటి పని చేయబోతుంది అంటూ షాక్ అవుతున్నారు.

మరి ఇంతకీ నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి పోస్ట్ పెట్టింది.

నిజంగానే నయనతార(Nayanthara) ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు దాటుకొని ప్రస్తుతం సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా( Lady Superstar ) పేరు తెచ్చుకున్న నయనతార మిడిల్ రేంజ్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలకు నయనతార ఎంతో బాగా సెట్ అవుతుంది.ఇక ఈమె నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అయితే అలాంటి నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

"""/" / అలాగే వీరిద్దరూ సరోగసి ప్రాసెస్ ద్వారా ఇద్దరు కవల పిల్లల్ని కన్నారు.

ఇక రీసెంట్ గా నయనతార బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో( Jawan ) నయనతార హీరోయిన్ గా చేసి బాలీవుడ్ లో కూడా అదరగొట్టింది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొత్త ప్రారంభం మ్యాజిక్ ని మీరు నమ్మండి అంటూ ఒక కొత్త ఫోటోని షేర్ చేసింది.

"""/" / అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు నయనతార హీరోయిన్ గా నటనకు గుడ్ బై చెప్పి డైరెక్టర్ గా మారబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నయనతార తన సినీ కెరియర్ లో కొత్త అధ్యాయంలో అడుగు పెట్టడం కోసమే ఇలా పోస్ట్ పెట్టిందని, త్వరలోనే నయనతార(Nayanthara) నటనకు గుడ్ బై చెప్పి దర్శకురాలిగా మారబోతుంది అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరి నిజంగానే నయనతార నటనకు గుడ్ బై చెప్పి దర్శకురాలుగా మారబోతుందా అనేది ముందు ముందు చూడాలి.

How Modern Technology Shapes The IGaming Experience