అలా పిలవొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసిన నయనతార.. ఫ్యాన్స్ పాటించడం సాధ్యమేనా?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నయనతార(Nayanatara) గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తూనే బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
పెళ్లయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలలో నటిస్తోంది నయనతార.
అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను అభిమానులు వాటి సొంత పేర్లతో కంటే టైటిల్స్ తో ఇష్టమైన పేర్లతో పిలిస్తే చాలా ఇష్టపడుతూ ఉంటారు.
"""/" /
చాలామంది సంతోషిస్తూ కూడా ఉంటారు.ఉదాహరణకు పవర్ స్టార్, సూపర్ స్టార్,ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ (Power Star, Super Star, Icon Star, Stylish Star)ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు.
ఇలాంటి పేర్లతో సంప్రదించినప్పుడు వారు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు.కానీ నయనతార మాత్రం ఇలాంటి బిరుదులు వద్దు అంటుంది.
మాములుగా నయనతారను అంతా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.అయితే ఇకపై తనను అలా పిలవొద్దని కోరుతోంది నయనతార.
ఈ మేరకు ఆమె ఏకంగా ప్రకటన కూడా విడుదల చేసింది.నన్ను చాలామంది అభిమానంతో లేడీ సూపర్ స్టార్ అనిపిలుస్తుంటారు.
"""/" /
మీ అందరి ప్రేమాభిమానాల నుంచి ఆ టైటిల్ పుట్టుకొచ్చిందనే విషయం నాకు తెలుసు.
అయినప్పటికీ ఇకపై అంతా నన్ను నయనతార అని మాత్రమే పిలవాలని కోరుకుంటున్నాను.నా మనసుకు దగ్గరైన పేరు నయనతార మాత్రమే అని చెప్పుకొచ్చింది నయనతార.
మరి అభిమానులు ఇక మీదట అయినా అలా పిలవకుండా ఉంటారేమో చూడాలి మరి.
కాగా సమంత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.