నయన్ జంట పెళ్లి పనులు స్టార్ట్ చేసారా.. వివరాలు ఇవే!

ఇటీవల కాలంలో ఎక్కడ చుసిన క్రేజీ జంటలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్ - రణబీర్ కపూర్ తో పాటు అది పిన్ని శెట్టి-నిక్కీ గల్రాని, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వంటివారు పెళ్లి చేసుకున్నారు.

ఇక ఇప్పుడు మరొక లవ్ బర్డ్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.నయనతార ప్రెసెంట్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.

అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఎక్కడకు వెళ్లిన కూడా ఒకరిని విడిచి ఒకరు వదిలి వెళ్లకుండా ఇద్దరు కలిసి తిరుగుతూ ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అవి కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతూ ఉంటాయి. """/"/ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం దాటవేస్తూ వస్తున్నారు.

ఎట్టకేలకు వీరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకోబోతున్నారు అని టాక్.

అది కూడా తిరుమల తిరుపతి సన్నిధిలో అని తెలుస్తుంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పెళ్లి చెన్నై లో అని తెలుస్తుంది.

జూన్ 9కి మరొక 20 రోజులు మాత్రమే ఉండడంతో అప్పుడే ఈ జంట పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసినట్టు టాక్.

"""/"/ ఈ వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవ్వనున్నారని వార్తలు వస్తునాన్యి.

పెళ్లి తర్వాత చెన్నై లో గ్రాండ్ హోటల్ లో సెలెబ్రిటీల కోసం రెసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట.

పుష్ప ది రూల్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం మాత్రం పక్కా!