అట్లీ నయన్ మధ్య విభేదాలు… ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన నయనతార?

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు అందుకు ఉన్నటువంటి వారిలో డైరెక్టర్ అట్లీ ( Atlee ) ఒకరు.

దర్శకుడుగా ఈయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయనకు అపజయం ఎరుగని దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.

తాజాగా అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ( Shahrukh Khan ) నయనతార( Nayanatara )హీరో హీరోయిన్లుగా జవాన్( Jawan Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా విడుదలైన అనంతరం నయనతార డైరెక్టర్ అట్లీపై చాలా కోపంగా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"""/" / సినిమాలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయంలో నటించారు.ఇందులో షారుక్ ఖాన్ సరసన ఒక పాత్రలో నయనతార హీరోయిన్గా నటించగా మరొక పాత్రకు దీపిక పదుకొనే నటించారు.

అయితే ఈ సినిమాలో నయనతార కంటే దీపికా పదుకొనే ( Deepika Padukone )పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, నయనతారకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నయనతార డైరెక్టర్ అట్లీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్ లో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"""/" / ఈ విధంగా డైరెక్టర్ అట్లీ తనను అవమానపరిచినందుకు ఇకపై తన డైరెక్షన్లో నయనతార అసలు నటించకూడదని నిర్ణయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా తన గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె స్పందించారు.

అయితే తన గురించి అసత్యపు వార్తలు రాసినటువంటి యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని నయనతార సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ అట్లితో విభేదాల గురించి కూడా నయనతార స్పందించి ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చారు.

నేడు డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈమె ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.

తనని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.నయనతార ఇలాంటి పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని స్పష్టంగా అర్థం అవుతుంది.

పాక్ నటుడి నోట భారత మాట.. దీపక్ పెర్వానీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు..