నయన్ విఘ్నేష్ పై కాదు వాళ్లపై చర్యలు తీసుకుంటారట.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
నయనతార విఘ్నేష్ శివన్ సరోగసి విధానంలో పిల్లల్ని కన్నారనే సంగతి తెలిసిందే.అయితే నయన్ దంపతులు నిబంధనలను పాటించి పిల్లల్ని కన్నారని కొంతమంది చెబుతుంటే మరి కొందరు మాత్రం నయన్ దంపతులు నిబంధనలను పాటించలేదని చెబుతుండటం గమనార్హం.
అయితే ఈ వివాదానికి సంబంధించి మరో కీలక మలుపు చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.
సుప్రీంకోర్టు సరోససి విధానాన్ని నిషేధించింది.అయితే నిషేధించిన విధానంలో నయన్ దంపతులు పిల్లల్ని ఎలా కంటారంటూ ప్రశ్నలు వ్యక్తమవుతుండగా ఈ వివాదానికి సంబంధించి నయన్ దంపతులకు సహకరించిన ఆస్పత్రి యజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
మెడికల్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టారని బోగట్టా.సరోగసి ద్వారా పిల్లల్ని కనాలంటే పెళ్లై ఐదేళ్లు పూర్తి కావాలని నిబంధనలు చెబుతున్నాయి.
నయనతార దంపతులకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టడంలో సహకరించిన వైద్యాధికారులకు మాత్రం ఇబ్బందులు తప్పవని బోగట్టా.
వైద్యులు విధివిధానాలను నయన్ దంపతులకు వివరించారా? లేదా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
వైద్యులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్లపై చర్యలు తప్పవని సమాచారం.నయన్ విఘ్నేష్ సెలబ్రిటీలు కాబట్టి సరోగసి విధానంలో పిల్లల్ని కనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
"""/"/
నయనతార దంపతులు ముందుగానే సరోగసి విధానానికి రిజిష్టర్ చేసుకున్నారని అందువల్ల ఈ విధానంలో పిల్లల్ని కన్నా ఎలాంటి సమస్య లేదని మరి కొందరు చెబుతున్నారు.
వైద్య అధికారుల బృందం ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా నయన్ విఘ్నేష్ మాత్రం ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
నయనతార పేరు తరచూ వివాదాస్పద అంశాల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
కొంతమంది కావాలనే నయనతారను టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025